'బిగ్ బాస్'లో ట్విస్ట్: సీక్రెట్ రూమ్‌లో లోబో!
on Oct 18, 2021
హౌస్‌లో మెంబర్స్‌కు బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. వాళ్ళకు తెలియకుండా ట్విస్ట్ ప్లే చేశాడు. కొంచెం తెలివిగా ఆలోచిస్తే... హౌస్ మెంబర్స్ కనిపెట్టడం కష్టమేమీ కాదేమో! అయితే, ఎలిమినేషన్ విషయంలో చిన్న ట్రిక్ ప్లే చేశారు. ఆడియన్స్‌కు ఇది కిక్ ఇచ్చే అంశమే. మున్ముందు ఎపిసోడ్స్‌లో గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని హింట్ ఇచ్చింది. అసలు, ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...
ప్రతి వారం 'బిగ్ బాస్' నుండి ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. ఐదో వారం హమీదా ఎలిమినేట్ అయ్యింది. ఆరో వారం లోబోను ఎలిమినేట్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. అతడిని నాగార్జున స్టేజి మీదకు పిలిచారు. అయితే, షో నుండి బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు. ఇది లాస్ట్ వీక్ ట్విస్ట్.
సాధారణంగా 'బిగ్ బాస్' నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల చేత ఇంటిలో సభ్యుల గురించి పాజిటివ్, నెగెటివ్ అభిప్రాయాలు తీసుకోవడం కామన్. అయితే, లోబోతో అవేవీ చెప్పించలేదు. ఈ యాంగిల్ నుండి ఆలోచిస్తే... లోబో ఎలిమినేట్ కాలేదనే సంగతి ఈజీగా అర్థమవుతుంది. మరి, ఎవరు ఆ విషయం ముందు పసిగడతారో చూడాలి. ఇక, బిగ్ బాస్ నుండి ఆరో వారం నటి శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
